ZPHS Reddypet Sponsor a school

పీపుల్ ఫర్ ఇండియా 80000 రూపాయలు ఆర్థిక సహకారం.

పీపుల్ ఫర్ ఇండియా ఆర్థిక సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెడ్డిపేట్ నందు రూపాయలు 80 వేల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది.


క్రింద సూచించబడిన అభివృద్ధి పనులు చేయడం జరిగింది.

  1. తొమ్మిది మూత్ర శాలలు మరియు మరుగుదొడ్ల యందు టైల్స్ వేయడం జరిగింది.
  2. పైపులు ,water taps మరియు toilets లో పూర్తి మరమ్మత్తులు చేయడం జరిగింది.
  3. వాటర్ ట్యాంక్ చుట్టూ హ్యాండ్ వాష్ కొరకు ఏరియా నిర్మించడం జరిగింది.మరియు నల్లాలు పైపులు వేయించడం అయినది.
  4. అన్ని మూత్రశాలల కు నూతన తలుపులు ఏర్పాటు చేయడమైనది.
    దీనికి సంబంధించిన ఆర్థిక సహాయం శ్రీ దినేష్ కుమార్ USA గారు అందించడం జరిగింది.

అంతేగాకుండా పీపుల్ ఫర్ ఇండియా కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు పాఠశాలలో అభివృద్ధి పనులు చేయుట కొరకై జడ్.పి.హెచ్.ఎస్ రెడ్డి పేట శ్రీ దినేష్ కుమార్ గారు దత్తత తీసుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.


పీపుల్ ఫర్ ఇండియా వ్యవస్థాపకులు శ్రీ సూరజ్ పద్ధతి గారికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెడ్డిపేట్ తరపున ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు ఎస్ఎంసి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఇందుకు సహకరించిన అటువంటి ఉపాధ్యక్షులు శ్రీ అరవింద్ గరిపల్లి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.


మీరు అందించిన ఆర్థిక సహాయానికి పూర్తి న్యాయం చేకూరుస్తామని హామీ ఇస్తున్నాము.