Sponsor a school details

  • Home
  • Profile
  • LV
  • Infrastructure

ZPHS Govt High School

శివనగర్ , వరంగల్
Classes 6th to 10th
Strength 354

About School

ప్రభుత్వ ఉన్నత పాఠశాల . శివనగర్ , వరంగల్
ఉపోధ్ఘాతము:
లక్ష్యాలు చేరుకోవడంలో ఉపాధ్యాయుల సమిష్టి కృషి , విద్యాధికారులు, SMC, వివిధ సామాజిక సంస్థలు, పోషకుల సహకారముతో విద్యాసంవత్సరం సంతృప్తిగా గడచింది.
మా పాఠశాల :
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శివనగర్ 1950 సంవత్సరంలో ప్రాధమిక పాఠశాలగా ఏర్పడి, అంచెలంచెలుగా ఉన్నత పాఠశాలగా రూపుదిద్దు కున్నది. దీని వెనుక ఎందరో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అధికారులు, అనధికారులు, ప్రజా ప్రతినిధుల కృషి ఉన్నది.
విద్యార్ధుల సంఖ్య - హాబిటేషన్:
పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమములలో బోధన జరుగుచున్నది. శివనగర్, ACరెడ్డి నగర్ , పుప్పాల గుట్ట , మైసయ్యనగర్ , SC బాలుర హాస్టల్ ఆవాసముల నుంచి 2021-22 లో 208 బాలురు + 148 బాలికలు ) 354 మంది విద్యార్ధులు విద్యాభ్యాసము చేశారు.
ఫర్నిచర్-వసతి:
స్థలాభావం వల్ల పాఠశాల క్రింది అంతస్ధులో ప్రాథమిక పాఠశాల , పై రెండు అంతస్థులలో ఉన్నత పాఠశాల నిర్వహించబడుతున్నది. తరగతి గదులతోపాటు HM Room , DIGI Room , Computer lab ఉన్నవి.
విద్యార్ధులకొరకు 120 డ్యూయల్ బెంచిలు ఉన్నవి.
బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్స్, నిరంతర నీటి సరఫరా ఉన్నవి. త్రాగునీటి సౌకర్యం కొరకు వాసవి వనితా క్లబ్ వారి సహకారంతో మినీ మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేయబడినది. లక్ష్య సాధన దిశగా: *పాఠశాలకు సక్రమముగా రాని విద్యార్ధులను గుర్తించి ఉపాధ్యాయులు మరియు SMC సహకారముతో తల్లిదండ్రులను సంప్రదించి వారిని క్రమముగా బడికి వచ్చునట్లు చేశాము. *చదవడం,వ్రాయడం, గణిత చతుర్విధ ప్రక్రియలలో వెనుక బడిన విద్యార్ధులను గుర్తించి వారికి 3Rs నిర్వహించాము. * మనTV , ROT మరియు డిజి ప్రొజెక్టర్ ద్వారా తరగతులు నిర్వహించాము. *గ్రంధాలయము లోని పుస్తకములు, వార్తా పత్రికలు విద్యార్ధులకు అందుబాటులో ఉంచి వారిలో పఠనా సామర్ధ్యాల పెంపుదలకు కృషి చేశాము. *నైతిక ప్రవర్తనలో పరివర్తన కొరకు ప్రతిదినము ప్రార్ధనా సమయములో నీతి పద్య పఠనము, ఆ రోజు ప్రాధాన్యత, ప్రముఖుల జీవిత విశేషములు వివరిస్తున్నాము. *ప్రతి శనివారము వివిధ సాంస్కృతిక , భాషా కార్యక్రమములు,చిత్రలేఖనము నిర్వహిస్తున్నాము. * PET సహకారముతో తరచు ఆటల పోటీలు, వ్యాయామ కార్యక్రమములు నిర్వహిస్తున్నాము. * సైన్స్ దినోత్సవము సందర్భంగా సైన్స్ ఫెయిర్ నిర్వహించాము. జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్, ఇన్స్ఫైర్ సైన్స్ ఎగ్జిబిషన్, చెకుముకి టాలెంట్ టెస్ట్ లలో విద్యార్ధులు పాల్గొని ప్రతిభ ప్రదర్శించారు.
SMC భాగస్వామ్యం:
పాఠశాలలో క్రమంగా యాజమాన్య కమిటీ సమావేశములు నిర్వహించి పలువిషయములు చర్చించి నిధుల వినియోగము మరియు పాఠశాల అభివృద్ధికై సూచనలు, సలహాలు స్వీకరించి వారి భాగస్వామ్యముతో అమలు చేస్తున్నాము.
SSC: మా జిల్లా విద్యాశాఖాధికారి గారి ఆదేశముల మేరకు మా ఉపాధ్యాయ బృందం నిరంతర కృషితో ఉదయం, సాయంత్రము ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్ నిర్వహించి ఈ విద్యా సంవత్సరం SSC లో మెరుగైన ఫలితాలు సాధించాము.
ప్రత్యేక సమావేశములో విద్యార్ధులను , తల్లిదండ్రులను సత్కరించడం జరిగినది. రాబోవు విద్యా సంవత్సరములో 100% ఫలితముల సాధనకై కృషిచేస్తాము. కో కరికులర్ & ఎక్స్ట్రా కరికులర్ అంశములు:
పోతన విజ్ఞాన పీఠం వరంగల్ వారు నిర్వహించిన పద్యపఠనా పోటీలో R.మేఘనప్రధమ స్థానం పొందినది.
NCC camp లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రముము లో A.ప్రజ్ఞశ్రీ , M.కీర్తిమ బహుమతులు సాధించారు.
మండల స్థాయి చెకుముకి క్విజ్ పోటీలో G.రమ్య S.పవన్,R.మేఘన ప్రధమ స్థానం పొందారు. పాఠశాలలో నిర్వహించిన వివిధ కార్యక్రమములు
బడిబాట
ఉచిత పాఠ్యపుస్తకముల పంపిణీ,
ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ.
వాసవి వనితా క్లబ్ వారిచే విద్యార్ధులందరికి 1,00,000/- విలువైన షూ, టై, బెల్ట్, బ్యాడ్జ్ పంపిణీ. శ్రీ వీరన్న గారిచే వ్యక్తిత్వ వికాస తరగతి నిర్వహణ
శ్రీ పృథ్వీ రాజ్ గారిచే Goal setting motivation class. వాసవీ వనితా క్లబ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి సహకారముతో అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ
ప్రపంచ జనాభా దినోత్సవము K.SREEDHAR
Headmaster

Sponsor Name :

Principal Name : K Sreedhar

శ్రీధర్ కొమ్మోజు
M.Sc(Maths)., M.Ed
ప్రభుత్వోన్నత పాఠశాల, శివనగర్, వరంగల్
1994నుంచి 2021 వరకు SA(Maths)గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ, బసంత్ నగర్ లలో విధుల నిర్వహణ.
APUS ఉపాధ్యాయ సంఘం వారిచే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా సత్కారం.
పెదపల్లి MP శ్రీ G.వివేక్ గారిచే బసంత్ నగర్ లో సన్మానము
2010 డిశెంబరు నుంచి 2015 జులై 8 వ తేదీ వరకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా లక్షెట్టిపేట, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా విధినిర్వహణ.
09-07-2015 నుంచి వరంగల్ , శివనగర్ , ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేయుచున్నాను.
2019 వరంగల్ అర్బన్ జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయునిగా ప్రభుత్వ పురస్కారము.

Guide Teacher : B Raj Kumar

నా పేరు B.రాజ్ కుమార్, నేను 2013 నుంచి శివనగర్ schoolలో పనిచేస్తున్నాను.పాఠశాల అన్ని కార్యక్రమాలో చురుకుగా పాల్గొని, పిల్లలను కూడా భాగస్వామ్యం చేసినాను.


Request Name Priority Date Description Amount

Fund Collection

Podcasting operational change management inside of workflows to establish a framework. Taking seamless key performance indicators offline to maximise the long tail. Keeping your.

Make Donation

Keeping your eye on the ball while performing a deep dive on the up mentality to derive

Become a Volunteer

Keeping your eye on the ball while performing a deep dive on the up mentality to derive

Give Scholarship

Keeping your eye on the ball while performing a deep dive on the up mentality to derive

Needs

Talon Harmonie

Teacher
Operational change management inside of workflows to establish a framework. Taking seamless


Lead with values Class for 2021

Lead with values Class for 2020

Lead with values Class for 2019

Robotics Club

Book Club

Infrastructure

Youth Projects