Science lab equipment Donation at ZPHS Venkiryala

తేదీ10.02.2021 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెంకిర్యాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి వి ఎలిజబెత్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో People for India. Lead with values సంస్థ పాఠశాల విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను, విలువలను, వక్తృత్వ నైపుణ్యాలను, వివిధ విషయజ్ఞానాన్ని, ప్రతిభాపాటవాలను పెంపొందించడానికి వాళ్ళుచేసే ప్రయత్నంలో భాగంగా సంస్థ సెంట్రల్ సెక్రటరీ గారెపల్లి అరవింద్ గారు బీబీనగర్ మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెంకిర్యాలకు విచ్చేసి పాఠశాలకు కావలసిన సైన్స్ పరికరాల కోసం సుమన్ గజ్వెల్లి గారు పంపిన 15000. రూపాయల చెక్కును పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి వి ఎలిజబెత్ గారికి అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ సైన్స్ వినడం కంటే ప్రయోగం చేయడం ద్వారా నేర్చుకుంటే ఎప్పటికీ గుర్తుంటుందని చెప్తూ తమ హర్షం వ్యక్తం చేశారు.