Robotics Class at zphs jalalpur

ఈ రోజు(25-09-2019) ZPHS జలాల్ పూర్ పాఠశాలలో విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు “రోబోటిక్స్” పై శిక్షణా కార్యక్రమం నిర్వహించబడినది. ఈ సందర్భంగా HM పెండెం నాగార్జున గారు మాట్లాడుతూ, సాధారణంగా ఈ రోబోటిక్స్ తరగతులు వేల రూపాయల ఫీజులు తీసుకుని అంతర్జాతీయ కార్పొరేట్ పాఠశాలలో మాత్రమే నిర్వహించబడుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడ కూడా ఇలాంటి ఆధునిక టెక్నాలజీ తో కూడిన తరగతులు నిర్వహించబడలేదు. యాదాద్రి జిల్లా లో మొట్టమొదటి సారిగా ” పీపుల్ ఫర్ ఇండియా” ZPHS జలాల్ పూర్ పాఠశాల లో అంతర్జాతీయ టెక్నాలజీ తో కూడిన “రోబోటిక్స్”పై శిక్షణా కార్యక్రమం నిర్వహించినందులకు PFI వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన PFI వైస్ ప్రెసిడెంట్ శ్రీ అరవింద్ గారేపల్లి గారు మాట్లాడుతూ జలాల్ పూర్ పాఠశాల లో అమలు చేస్తున్న PFI కార్యక్రమాలను గుర్తించి ఈ విద్యా సంవత్సరానికి రూ”50 000 ల విలువైన రోబోటిక్స్ సెట్, ల్యాప్టాప్ లు అందజేసినట్లు తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం రోబోటిక్స్ పై శిక్షణ నిచ్చారు. ఈ కార్యక్రమానికి Jalalpur Alumni Association అధ్యక్షుడు విజయకుమార్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ సుఖేందర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు మరియు చుట్టూ నాలుగు ఉన్నత పాఠశాల ల విద్యార్థులు మొత్తం నలబై మంది హాజరయ్యారు