సురక్షిత పాఠశాల కార్యక్రమం మరియు షీ టీం అవగాహన కార్యక్రమం
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దకార్పాముల
జిల్లా పరిషత్ పాఠశాల పెద్దకర్పాములలో నేడు People for India ఆధ్వర్యంలో సురక్షిత పాఠశాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే షీ టీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి PFI ఆర్గనైజర్ సుదర్శన్ గారి కోరిక మేరకు "షీటీం" సబ్ డివిజన్ ఇంచార్జి వెంకటయ్య గారు,"చైల్డ్ లైన్" కౌన్సిలర్ మణి మేడంగారు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలబాలికలు నిరంతరం ఎదుర్కొనే సమస్యలు,వేధింపులు నిత్యకృత్యంగా మారాయని వీటిని ఎదుర్కోవడం అందరి బాధ్యత అని,అలాగే బాలికలపై ఎలాంటి హింసకానీ,వేధింపులు కానీ ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోవడానికి "షీటీం" మరియు "చైల్డ్ లైన్" బాలికలకు వెన్నంటి ఉంటుందని అన్నారు. విద్యార్థులు డ్రగ్స్ కు మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని,ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి అంతర్జాలం,ఫోన్ లకు దూరంగా ఉండాలని,ఏదైనా సమస్య ఎదురైతే షీ టీం బృందానికి సమాచారం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భాగంగా PFIఆధ్వర్యంలో విద్యార్థులకు సురక్షిత పాఠశాల గురించి వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అంజయ్య,
PFI ఆర్గనైజర్ సుదర్శన్ ఉపాధ్యాయులు చంద్రశేఖర్, గణేష్,కవిత,సుగుణాకర్, రవీందర్, సేవ్యా,మహముద్, అశోక్, సయ్యద్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. |