Elocution Details

Gallery

  • Year 2019-aug
  • MandalRajapet
  • School Name ZPHS Nemilla
బాలబాలికలు,ఇటు తల్లితండ్రులకు;అటు సమాజానికి రెండు కళ్ళు. బాలురు అవుతున్నారు మృగాళ్ళు. సమాజంలో ఈనాటికీ స్త్రీల పట్ల చులకనభావం, నిర్లక్ష్యం ఉన్నాయి. అవే బాలికలకు శాపాలు అవుతున్నాయి . అన్ని రంగాల్లో అమ్మాయిలు దూసుకుపోతున్నారు.అయినా బాలికలు వేధింపులకు బలి అవుతున్నారు. పుట్టగానే ఈడపిల్ల కాదు, ఆడపిల్ల అంటున్నారు. తల్లి, అక్క, చెల్లి ఆడవాళ్ళని మరచిపోతున్న నీచులు ఆడపిల్లల ప్రాణాలను తింటున్నారు. పాఠశాలల్లో, కళాశాలల్లో, బస్సులలో, మెస్సులలో,బాటల్లో ,ఆటోల్లో ఆడపిల్లలు వేధించబడుతున్నారు . బాలికలను వేధించే రాక్షసులకు కఠిన శిక్షలు విధించాలి. ఆకతాయిలను సభ్యసమాజం నుండి బహిష్కరించాలి. బాలబాలికలకు ప్రాథమిక స్థాయినుండి నిర్బంధ ఆత్మ సంరక్షణా శిక్షణను అందించాలి. G. BBHAVANI, CLASS X , ZPHS. NEMILA, RAJAPET MANDAL.


Videos